08-01-2026 01:37:34 AM
సిద్దిపేట క్రైం, జనవరి 7 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ నరహరి కుటుంబానికి ఉమ్మడి మెదక్ జిల్లా 1995 బ్యాచ్ పోలీస్ అధికారులు సిబ్బంది ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. హెడ్ కానిస్టేబుల్ నరహరి సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించేవారు. విధినిర్వహణలో భాగంగా సిద్దిపేట నుంచి చేర్యాల వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో 1995 లో ఆయన తో పాటు శిక్షణ పొందిన ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కలసి రూ.లక్ష నరహరి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ భాస్కర్, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.