08-01-2026 01:39:16 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (విజయక్రాంతి): క్రీడల్లో గెలుపు ఓటములు సహజం.. క్రీడా స్ఫూర్తి ముఖ్యమని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. గెలుపులో ఆనందాన్ని ఓటమిలో పాఠాలన్నీ జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలని మరో మంత్రి సీతక్క పేర్కొన్నారు. 69వ జాతీయస్థాయి అండర్17 బాలుర కబడ్డీ పోటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, కంది చారిటబుల్ ట్రస్ట్, మౌర్య టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ర్ట మంత్రులు వాకిటి శ్రీహరి, ధరసరి అనసూయ(సీతక్క), పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు.
పోటీలను ప్రారంభించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. మరో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ జాతీయస్థాయి కబడ్డీ పోటీలను బయ్యారం గ్రామంలో నిర్వహించేందుకు బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, అనుభవాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. . కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మ, క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే,సర్పం చందర్రావు, కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి, విశ్వ భరత్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, క్రీడా శాఖ అధికారులుతదితరులుపాల్గొన్నారు.