calender_icon.png 9 January, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి మృతి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

08-01-2026 01:37:06 AM

గొల్లపల్లి మండలం బిబిరాజ్‌పల్లిలో ఘటన

ధర్మపురి, జనవరి 7(విజయక్రాంతి): తల్లి మృ తిని తట్టుకోలేక గొల్లపల్లి మండలం బిబిరాజ్ పల్లి గ్రామానికి చెందిన మల్యాల రామ్ చరణ్(20)ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎం. కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. రామ్ చరణ్ తల్లి అంజవ్వ గత సంవత్సరం అనారోగ్యం కారణంగా చనిపోయిం ది. అప్పటినుంచి రామ్ చరణ్ తన అమ్మ మృ తిని జీర్ణించుకోలేక ప్రతిరోజు బాధపడుతూ ఉం డేవాడు. ఈ క్రమంలో అమ్మను తలుచుకుంటూ మానసికంగా బాగా కృంగిపోయి, జీవితంపై విర క్తి చెందేవాడు. తన ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, రామ్ చరణ్ తండ్రి  గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.