వెనుకబడిన కుటుంబాలకు ఆర్థిక భరోసా.. కల్యాణలక్ష్మి
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, జూన్ 11 : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల తల్లిదండ్రు లు తమ కూతురి వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం లక్ష 16 వేల రూ పాయలు ఆర్థిక సహాయం చేస్తుంది అని ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల య్య అన్నారు. గురువారం యాదగిరిగుట్ట బీర్ల నివాసంలో ఆలేరు నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన క ళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒక ముఖ్యమైన పథక మన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కుమార్తెల వివాహ సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తున్నదన్నారు. ఆలే రు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయనారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్ర జాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






