విద్యుదాఘాతంతో మహిళ మృతి
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) జూన్ 11: విద్య దాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం లో బుధవారం సా యంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ మం డలం ఓగోడు గ్రామానికి చెందిన దాసరి లక్ష్మి(35) అనే మహిళ తన తల్లి గారి గ్రామమైన మండల పరిధిలోని తిమ్మాపురం గ్రా మానికి తన తల్లిదండ్రులు వనగాల రాము లు, లక్ష్మమ్మలను చూడడానికి గత వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.
ఈ క్రమంలో ఇంట్లో తమ బట్టలు ఉతికి ఆరవేయడానికి వెళ్ళగా బట్టలు ఆరవేసే దండానికి విద్యుత్ సరఫరా జరిగి విద్యుత్ షాక్ రావడంతో లక్ష్మి అక్కడక్కడే మృతి చెందిందన్నా రు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ ఘట నా స్థలికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలు లక్ష్మికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మీ సోదరుడు వనగాల యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ రాములు తెలిపారు.






