ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలి
డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ
హుజూర్‌నగర్, జూన్ 11 : ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు సందర్శించి ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నా యకులు డిమాండ్ చేశారు. గురువారం ప ట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈ ఓ సైదానాయక్‌కు వినతిపత్రం అందజే సి...ఆ సంఘం అధ్యక్షుడు ఇందిరాల నరేష్ మాట్లాడుతూ...ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని, పాఠ్యపుస్తకాల విక్రయాలను నిలిపివేయాలని కోరారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవే ట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాల ని డిమాండ్ చేశారు. యూనిఫాం,షూస్, టై, ఐడీ కార్డు,అడ్మిషన్ ఫీజుల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.






