రజకులకు ఆర్థిక సహకారం అందించాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య
మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి): రజకులకు రూ. 10 లక్షల సహకారం ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య కోరారు. శని వారం బీసీ భవన్‌లో జరిగిన వృత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలలో రూ. 10 లక్షల ఆర్థిక సాయంతోపాటు జిల్లాకు రూ. 10 కోట్లతో మోడ్రన్ దోబీగాట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, వీటితోపాటు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్‌టీ4లో చేర్చాలని, ప్రమాదంలో మరణించిన వృత్తిదారుడికి ఐదు లక్షల బీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, సభ్యులు తంగళ్లపల్లి వెంకటేష్, ముష్కర చందు, తరిగొప్లుల భాగ్య, దుర్శెట్టి రాములు, నడిగోటి తిరుపతి, రమేష్, రజిత, రమేష్ పాల్గొన్నారు.






