15 July, 2026 | 1:11 AM

మంచిర్యాల ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

09-06-2024 01:55 AM

మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు శనివారం నియోజక వర్గంలో సుడిగాలిలా పర్య టించారు. పట్టణంలో ఉదయం  సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన ఆయన మార్కె ట్ యార్డులో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మా ణ పనులను పరిశీలించారు. అనంతరం ఐబీ చౌరస్తాలో లంబలి, చలివేంద్రాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి హాజీపూర్ మండలం గుడిపేట వెళ్లారు.  మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత లక్సెట్టిపేటకు పో యారు. జూనియర్ కళాశాల, పాఠశాల నిర్మాణా పనులను తిలకించారు.