3 July, 2026 | 9:36 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

ఫోన్ మర్చిపోయారా.. డోంట్ వర్రీ!

23-02-2025 12:24 AM

కొన్నిసార్లు మనం ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాము. దాని కోసం ఇల్లంతా జల్లెడ పడుతుంటాము. వేరే ఫోన్‌తో కాల్ చేసి కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాము. ఒకవేళ ఫోన్ మ్యూట్‌లో ఉందంటే అంతే సంగతి. దీంతో సమయం వృథా అవ్వడమే కాకుండా.. కాస్త ఆందోళనకు కూడా గురవుతుంటాము. అయితే మన ఫోన్‌లో ఓ యాప్ ఉంటే చిటికెలో ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు.

అదే ఫైండ్ మై ఫోన్ క్లాప్, విజిల్ యాప్. దీన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక రింగింగ్, ఫ్లాషింగ్, వైబ్రేటింగ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది. హడావుడిలో ఫోన్ ఎక్కడో పెట్టి మరిచిపోతే.. చప్పట్లు కొట్టడం లేదా ఈల వేయడం చేయాలి. ఇలా చేస్తే ఈ యాప్ ద్వారా మీ ఫోన్ వైబ్రేషన్, ఫ్లాష్ లేదా రింగ్‌టోన్‌తో ప్రతిస్పందిస్తుంది.