నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం
కరీంనగర్ క్రైమ్: పద్మశాలి జిల్లా చేనేత సహకార సంఘం వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు మెతుకు పెంటప్ప పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్ అన్నారు. కరీంనగర్ లో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం నివాస ప్రాంగణంలో మెతుకు పెంటప్ప వర్ధంతి సభను శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసాల రమేష్ హాజరై మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతం కోసం జిల్లాలో మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల ఉపాధి కోసం చేనేత సహకార సంఘాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడని అన్నారు. కరీంనగర్ లోని నిరుపేద పద్మశాలి కుటుంబాల కోసం పద్మనగర్, మార్కండేయ కాలనీ ఏర్పాటు చేసినారన్నారు. పద్మశాలి కుటుంబాల పేద విద్యార్థులు విద్య అభ్యసించేందుకుగాను కరీంనగర్లో పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ లో కీలకపాత్ర పోషించాడని అన్నారు. చేనేత కార్మికుల నివేషణ స్థలాల కోసం కృషి చేస్తాడని కొనియాడారు వీరి ఆశయ సాధన కోసం పద్మశాలీలందరం ఐక్యతతో ముందుకు వెళ్లాలని అన్నారు.






