3 July, 2026 | 10:14 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం

03-07-2026 09:21 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓగా బాధ్యతలు చేపట్టి బదిలీపై మద్నూర్ ఇన్చార్జ్ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ రెడ్డికి శుక్రవారం డిఎల్పివో ప్రసాద్ రావు, ఎంపీవో నాగరాజు, ఎంపీడీవో ఆనంద్, ఏపీవో సౌజన్య, బాన్సువాడ మండలంలోని  సర్పంచులు, కార్యదర్శులు శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

బాన్సువాడ మండల ఎంపీవోగా ఐదు సంవత్సరాల ఐదు నెలల మూడు రోజులు విధులు నిర్వహించి అందరి మన్నలను పొందిన అధికారిగా పేరు పొందడం జరిగింది. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సమస్యల పరిష్కారం విధుల పట్ల నిబద్ధత కలిగిన అధికారి అని సర్పంచ్ లు కార్యదర్శులు పేర్కొన్నారు. అయినతో ఉన్న  అనుబంధాన్ని పంచుకున్నారు.అదేవిధంగా బదిలీపై వెళ్లిన గ్రామపంచాయతీ కార్యదర్శులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.