3 July, 2026 | 9:50 PM

Breaking News

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •  

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్

03-07-2026 09:15 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మద్ది దాకవ్వ ఇంట్లో వర్షపు నీరు కారుతూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి వెంటనే స్పందించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గించేందుకు ఇంటి పైకప్పుపై కప్పేందుకు టార్పాలిన్ కవర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉంటామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మౌనిక, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చింతనతో సిద్ధరాములు, నాయకులు మామిడి చందు, తుడుం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.