13 May, 2026 | 1:44 AM

అక్షర్ పటేల్‌కు జరిమానా

13-05-2026 12:30 AM

స్లో ఓవర్‌రేట్‌పై బీసీసీఐ చర్యలు

ముంబై, మే 12 : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచి జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా బీసీసీఐ అతనికి భారీ జరిమానా విధించింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది.

దీంతో అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి తప్పిదం కావడంతో కెప్టెన్‌కు మాత్రం ఫైన్ పడింది. మరోసారి ఈ తప్పిదం రిపీటైతే కెప్టెన్‌తో పాటు ఆటగాళ్ళకు కూడా జరిమానా విధిస్తారు.

కాగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ సమస్య పలువురు కెప్టెన్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, హార్థిక్ పాండ్యాలపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. గతంలో ఒక జట్టు పదేపదే స్లో ఓవర్ రేట్ కు పాల్పడితే కెప్టెన్లపై సస్పెన్షన్ విధించే నిబంధన ఉండేది. అయితే 2025 సీజన్ నుంచి ఈ రూల్‌ను బీసీసీఐ రద్దు చేసింది. ఇదిలా ఉంటే గత మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతంగా పంజాబ్‌పై గెలిచింది.