13 August, 2026 | 4:03 PM

శబరి మాత ఆలయాలలో వసతులను కల్పిస్తాం

13-08-2026 02:30 PM

బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని శబరిమాత ఆలయాలలో వసతులను కల్పిస్తామని స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో అఖండ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని షెడ్డును ప్రారంభించారు. అనంతరం అఖండ జ్యోతిని స్వామి శివానంద సమక్షంలో వెలిగించడం జరిగింది. అనంతరం ఏర్పాటు అయిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... శబరిమాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు అనంతరం పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉన్నారని కనుగొట్ట గ్రామంలో శబరిమాత షెడ్డు నాతో వేయించడం ఆనందంగా ఉందన్నారు. షెడ్డు ఏర్పాటు విషయంలో తాను ఆలోచించానని అయితే శబరిమాతనే తనను ప్రోత్సహించి నిధులు మంజూరు చేయించిందని పేర్కొన్నారు. కాగా శబరిమాత ఆశ్రమంలో భజన కార్యక్రమాలను నిర్వహించడం కోసం శాశ్వతంగా గద్దెను నిర్మిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్ కోరిక మేరకు భక్తుల సౌకర్యం బస్సును ప్రారంభిస్తామన్నారు.

ఈ సందర్భంగా శబరిమాత ఆలయ కమిటీ అధ్యక్షులు కుమ్మరి భోజన్నతో పాటు ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం జరిగింది. కార్యక్రమంలో శబరిమాత శిష్యులు నర్సింగ్ రెడ్డి తోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. నెలరోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆశ్రమ కమిటీ వారిని కోరారు. అయితే కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.