7 May, 2026 | 1:55 AM

బొల్లారం గ్లోకెమ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

07-05-2026 12:55 AM

మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక శాఖ

జిన్నారం/అమీన్పూర్, మే 6 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండ లం బొల్లారం పారిశ్రామికవాడలో బుధవా రం గ్లోకెమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలోని ఒక్కసారిగా మంటలు చెలరేగి క్ష ణాల్లో ఇతర విభాగాలకు విస్తరించాయి. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో మం టలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి గాయాలు కాగా సహచరులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాలు మండుతుండడంతో దట్టమై న నల్లటి పొగ కమ్మేసింది. దీంతో స్థానికులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. కిలోమీటర్ల వరకు ఈ పొగ వ్యాపించింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.