7 May, 2026 | 1:28 AM

ఉట్నూర్ ఐటీడీఏ పీవోను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

07-05-2026 12:53 AM

ఉట్నూర్, మే 6 (విజయక్రాంతి): ఇటీవల ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం పీవో ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని పలు అంశాలపై ఎమ్మెల్యే పీఓ తో చర్చించారు.

ఈ కార్యక్రమంలో నార్నూర్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్లు దిగంబర్, సకారం, చందు, సురేష్, మాణిక్ రావు, రాహుల్, పైకు, పరమేశ్వర్, రాజంపేట ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, మాజీ సర్పంచ్లు ఊర్వేత రూప్ దేవ్, మడావి రూప్ దేవ్, మాజీ ఉప సర్పంచ్ పడ్ విష్ణు, మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.