27 June, 2026 | 11:35 AM

దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు

09-05-2026 04:29 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మండి హౌస్ ప్రాంతంలోని దూరదర్శన్ భవన్‌లో శనివారం ఒక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. దూరదర్శన్ భవన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించి మధ్యాహ్నం 2:05 గంటలకు ఒక కాల్ అందిందని, వెంటనే అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకుందని ఢిల్లీ అగ్నిమాపక సేవల (DFS) అధికారులు తెలిపారు.