9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

09-05-2026 04:19 PM

చెన్నై: విజయ్ టీవీకే పార్టీకి(Tamilaga Vettri Kazhagam) మద్దతుపై వీసీకే నేతలు కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. విజయ్ కు మద్దతుపై వీసీకే నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. రెండు సీట్లు ఉన్న వీసీకే పార్టీ నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీవీకేకు వీసీకే మద్దతిస్తే తమిళనాడులో(Tamil Nadu Government) ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్(Governor Rajendra Vishwanath Arlekar) ఆహ్వానించే అవకాశముంది. ఇప్పటికే చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఐయూఎంఎల్ టీవీకేకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి మాట తప్పింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికి మెజార్టీ(118) స్థానాలు లేకపోవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ తమిళ సీరియల్ గా కొనసాగుతోంది.  కాసేపట్లో వీసీసకే చీఫ్ తిరుమావళవన్ తో విజయ్ భేటీ కానున్నారు.