4 July, 2026 | 9:53 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఇంట్లో అగ్ని ప్రమాదం

03-04-2025 12:52 AM

సిద్దిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అర్థరాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించిన ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట పట్టణంలోని మారుతి నగర్ లో అర్థ రాత్రి  ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణానికి చెందిన బెల్లంకొండ వెంక టేశ్వర రావు ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రిస్తున్నారు.

రాత్రి 12గంటలకు షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ఒక్క కారు, మూడు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. ఆలస్యంగా గమనించిన యజమాని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

విద్యుత్ సరఫరాలో  హెచ్చు తగ్గులు రావడంతోనే ఈ ప్రమాదం వాటిల్లిందని ఇంటి యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగపోవడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.