09-09-2025 09:46:18 AM
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ లో(Visakhapatnam steel plant) మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద కోకింగ్ కోల్ లో మంటలు అంటుకున్నాయి. సిబ్బంది సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక(Fire Accident ) సిబ్బంది కోకింగ్ కోల్ లో మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్ కోల్ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంతమేరకు ఆస్తి నష్టం వాటిల్లిందన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.