09-09-2025 09:59:18 AM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం(Indalwai Mandal) గన్నారం శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. లారీ, కారు హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన నర్సింహారెడ్డిగా గుర్తించారు.