10 May, 2026 | 2:10 AM

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

30-06-2025 02:29 PM

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

ఎల్బీనగర్: ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో  జరిగిన అగ్ని ప్రమాదంలో రూ, 2లక్షల ఆస్తి నష్టంతోపాటు ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.‌ చైతన్యపురి డివిజన్ న్యూమారుతి నగర్ కాలనీలో(New Maruthi Nagar Colony)  శ్రీనివాస్ ఇంట్లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ సంభవించింది. వెంటనే మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ, 2లక్షలు విలువ చేసే గృహోపకరణాలు కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు ప్రణవ్ (22 ) తీవ్రంగా గాయపడడంతో వెంటనే వైద్యచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సంఘటను స్థలానికి చేరుకుని మంటలను వ్యాపించకుండా అదుపు చేశారు. సమాచారం అందుకున్న ఐదు నిమిషాల్లోనే ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ అధికారి శ్రీధర్ తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. జరిగిన నష్టం పై సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.