calender_icon.png 13 September, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

13-09-2025 12:58:09 PM

  1. శంషాబాద్ లో హైడ్రా దూకుడు.
  2. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రహరిని తొలగించిన హైడ్రా.
  3. శంషాబాద్ 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ.
  4. హైడ్రా ఆధికారులకు ఫిర్యాదు.
  5. ఉదయం నుండి కూల్చీవేతలు.
  6. అక్రమంగా నిర్మించిన ప్రహరిని కూల్చీవేసి ఫైన్సింగ్ ఏర్పాటు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధిలోని సాతామరాయి సర్వే నంబర్ 217లో 12 ఎకరాల స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసారు. ఈ భూమిని ప్రభుత్వం 2011లో ఇంటర్మీడియట్ బోర్డుకు కేటాయించింది. ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ ఇటీవల ఆ భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ విషయాన్ని చేపట్టి పోలీసు సిబ్బంది సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరిని కూల్చీవేసిన హైడ్రా ఆధికారులు ఫైన్సింగ్ ఏర్పాటు చేశారు.