calender_icon.png 13 September, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరతపై రైతుల ఆక్రోశం

13-09-2025 01:01:35 PM

ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా.

రైతులను బుజ్జగిస్తున్న పోలీసులు.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. సుమారు వారం రోజులుగా యూరియా బస్తాల కోసం ఆయా ఫర్టిలైజర్ దుకాణాలు కార్యాలయాలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విసిగి వేసగి శనివారం ఉదయం పాత వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైటయించి ధర్నా చేపట్టారు.

దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) తన సిబ్బందితో కలిసి వచ్చి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తామనిహామీ ఇచ్చారు.  పంటలను కాపాడుకోవడం కోసం ఎరువులు సకాలంలో అందక పంటలు పూర్తిగా ఎర్రబారి నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతులంతా రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి దాపురించ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.