31 July, 2026 | 12:40 AM

మునిరాబాద్‎లో భారీ అగ్నిప్రమాదం

30-11-2024 04:20 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మునిరాబాద్ లోని పత్తి గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగ కమ్మేసింది. మంటలను గమనించిన స్థానికులు భయంతో పరుగుతు పెట్టారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.