సికిం ద్రాబాద్‌లో అగ్నిప్రమాదం
17-05-2026 12:00 AM
సికింద్రాబాద్, మే 16 (విజయక్రాంతి): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని రెజిమెంటల్ బజార్ మెట్రో పోలీస్ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ హోటల్లోని మూడో అంతస్తులో ఉన్న వంట గదిలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల తీవ్రతతో భోజనశాల పూర్తిగా కాలిపోయింది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఇతర అంతస్తులకు, పక్క భవనాలకు వ్యాపించకుండా నివారించారు. ఈ హోటల్లో బస చేస్తున్న 67 మంది ఈ అగ్ని ప్రమాద ఘటనకు భయాందోళనకు గురికాగా వారిని హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ వాహనం ద్వారా సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు.






