పాలమూరు అక్రమాలపై విచారణ జరపాలి
- ఆర్థిక అవకతవకలు, నాణ్యత లోపాలు, బిల్లుల క్లుయిమ్
- విజిలెన్స్ డీజీ చౌహన్‌కు రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు
రాజేంద్రనగర్, మే 16 (విజయక్రాంతి): పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం కరివెన గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కురుమూర్తి రాయరిజర్వాయర్ పనుల్లో జరిగిన అక్రమాలు, నాణ్యత లోపాలపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని విజిలెన్స్, ఎ న్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ డీఎస్ చౌహాన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు తెలిపారు. వీరు ఇష్టారీతిన పనులు చేపట్టడంతో నిర్మాణ నా ణ్యత దెబ్బతిందన్నారు. నిబంధనల ప్రకారం పనులు పూర్తికాకపోయినా బిల్లులు క్లుయిమ్ చేసుకొని ప్రభుత్వాదాయానికి గండికొట్టారని ఆరోపించారు. అవకతవకలపై ఫిర్యాదు లు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టెండర్ కేటాయింపులు, నాణ్య తా పరిశీలన, ఆర్థిక నష్టం, పనుల్లో పారదర్శకత తదితర వాటిపై పూర్తి విచారణ చేపట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సంపత్ కుమార్, బత్తుల జితేందర్, గొటూరి రవీందర్ గౌడ్, ధర్మేంద్ర సాగర్, రేనట్ల మల్లేష్, దివాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






