గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
17-05-2026 12:00 AM
కూకట్‌పల్లి, మే 16(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని, సేవిస్తున్న మరో నలుగురిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో గంజాయి బ్యాచ్ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయి విక్రేతదారులిద్దరినీ, సేవిస్తున్న మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






