20 May, 2026 | 4:48 PM

పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం

20-05-2026 04:08 PM

నల్లగొండ,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు కూడా వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ​ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో పోలీస్ స్టేషన్ కి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, ఎంతమేర ఆస్తి నష్టం సంభవించిందనే అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.