ప్యారడైజ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం
24-08-2024 12:13 AM
భయంతో బయటకు పరుగులు తీసిన కస్టమర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. వందల మందితో రద్దీగా ఉండే హోట ల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. హోటల్ బిల్డింగ్ సెల్లార్‌లోని జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ అలుముకుంది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంట నే ఘటనాస్థలికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపులోకి తెచ్చారు.






