వ్యభిచార ముఠా గుట్టురట్టు
24-08-2024 12:30 AM
ఇద్దరు యువతులు, విటుడు, నిర్వాహకురాలి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): మియాపూర్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ టీం, మియాపూర్ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ స్వర్ణపురి కాలనీలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నది. పక్కా సమాచారంతో గురువారం రాత్రి మాదాపూర్ ఎస్వోటీ టీం, మియాపూర్ పోలీసులు దాడులు చేసి నిర్వాహ కురాలితో పాటు ఓ విటుడిని, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






