18 August, 2026 | 4:53 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు

29-11-2024 01:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి) : మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున వేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.