12 July, 2026 | 10:29 PM

సుప్రీంకోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం

02-12-2024 02:58 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.కోర్టు నెం11,12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూల్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు నిర్ధరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ హాని గాని, ఆస్తి నష్టంగాని జరుగలేదని సుప్రీంకోర్టు సిబ్బంది పేర్కొన్నారు.