12 July, 2026 | 11:26 PM

జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలివ్వండి

03-12-2024 01:00 AM

సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను 2 వారాల్లోగా అం దించాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకో ర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు కూడా ఇవ్వాలని సూచించిం ది. కాగా వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని తెలిపింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నెమ్మదిగా కొనసాగుతుందని ఏపీ డి ప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.