calender_icon.png 16 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రన్నింగ్ బస్సులో మంటలు

16-05-2025 12:01:27 AM

  1. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం 

మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారిపై ఘటన 

మేడ్చల్, మే 15(విజయ క్రాంతి): రన్నిం గ్ లో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన మేడ్చల్ పట్టణంలో44వ నెంబరు జాతీయ రహదారిపై జరి గింది. బండ మైలారం నుంచి కొంపల్లికి బ స్సు వెళుతుండగా, ఐటిఐ వద్దకు రాగానే బస్సులో రెడ్ లైట్ వచ్చింది. డ్రైవరు అప్రమత్త మై  బస్సును ఎడమ పక్కకు తీసుకుం టుండగానే ఆగిపోయింది.

ఆ వెంటనే మం టలు చెలరేగాయని, క్షణాల్లో బస్సు కాలిపోయిందని డ్రైవర్ దేవేందర్ తెలిపారు. బస్సు లో ప్రయాణికులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్ర మాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రావెల్స్ కి చెందిన బస్సు ఓ కంపెనీ ఉద్యోగులను తీసుకవస్తుంది. ఆ సమయంలో ఎవరూ లేరు. మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి వ చ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.