calender_icon.png 16 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద లీడర్లు జెండా మోసినోళ్ల సంగతి ఏంటి?

15-05-2025 11:59:49 PM

- ఏళ్ల తరబడి కోసం కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదు

- గ్రూపులు వర్గాలతో పార్టీకి తీవ్ర నష్టం

- కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీనియర్ నేతలు కార్యకర్తలు ఆవేదన

-హాజరైన పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రముఖులు

నిర్మల్ మే 15 (విజయక్రాంతి) : మేం పుట్టినప్పటినుంచి కాంగ్రెస్ లోనే పనిచేస్తున్నాం అధికారుల్లో ఉన్న లేకున్నా కాంగ్రె స్ పార్టీలోనే కార్యకర్తగా పనిచేస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో లీడర్లు మారుతున్నారు గెలుస్తున్నారు ఓడిపోతున్నారు మేం మాత్రం గిట్లనే ఉన్నాం. ఎన్ని రోజులు పార్టీ కోసం పని చేయాలి మాకు ఏమైనా గుర్తింపు ఉందా.

రేవంత్ రెడ్డి సర్కార్ అధికారులకు వచ్చి 16 నెల అయింది నిర్మల్ లో అసలు కాంగ్రెస్ పార్టీ బలం కంటే బలహీనంగానే ఉంది . దీనికి పార్టీ పట్టించుకోకపోవడమే కారణం. గ్రూపులు వర్గ పోరు వల్ల నిజమైన కార్యకర్తలకు నష్టం జరుగుతుంది.

అయినా కాంగ్రెస్ ను వీడం . బతికి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాం మారాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మీరు మారాలి సీనియర్ నేతలను గౌరవించాలి మాకు పదవు లు గుర్తింపు ఇవ్వాలి అంటూ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్ నేతలు కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్ లో డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి పిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్యేక పరిశీలకులు ఎం చంద్రశేఖర్ గౌడ్ ఆఫీస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా నిర్మల్ లోని సీనియర్ నేతలు కార్యకర్తలు పార్టీ అనుసరిస్తున్న విధానం పై తమకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలను విస్మరిస్తున్నారని అటువంటి వారిని పార్టీ దూరం చేసుకోవడం బాధ కలిగిస్తుందన్నారు. మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథం రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మహా నేత లు వెళ్లిపోయిన పార్టీ కోసం జెండా మూసి 30 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నామని ఒక సైనికుడిగా పనిచేస్తున్న తమకు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సరెడ్డి కాలం నుంచి శ్రీరరావు కాలం వరకు తాను పనిచేశానని ఇప్పుడు లీడర్ల మధ్య వర్గ పోరు గ్రూపు విభేదాల కారణంగా మాలాంటి నిజమైన కార్యకర్తలకు అన్యా యం జరుగుతుందని ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారని పార్టీ అధిష్టాందని సూటిగా ప్రశ్నించారు.

మాజీ మున్సి పల్ చైర్మన్ అప్పల గణేష్ మాట్లాడుతూ నిర్మల్ పటంతో పాటు నియోజకవర్గంలో స్థానికంగా బలంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్న నిజమైన కార్యకర్తలకు పార్టీ పదవులు ఇస్తే పార్టీకి ప్రజల ఉంటుందని పైరవీకారులకు పదవులు ఇస్తే వారు పార్టీ లు వదిలి వెళ్ళిపోతున్నారని తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా ఉండాలంటే నిర్మల్ నాయకులు వర్గ విభేదాలు వెడలాడి పార్టీలో ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ అసలు నిర్మల్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం కారణంగా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ పథకాలలో కాంగ్రెస్ నేతల మాటలు గౌరవించడం లేదని ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టమని తెలిపారు

పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది

కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి కార్యకర్తకు ప్రజాప్రతినిధికి తప్పకుండా గుర్తింపు ఇస్తామని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు పార్టీ నాయకులు విస్తృతస్థాయి సమావేశంలో తమ ఆవేదనను వెల్లవేసుకున్నారని దీని తప్పకుండా పరిష్కరించేలా చూస్తామన్నారు.

నిర్మల్‌లో గ్రూప్ రాజకీయాలు లేవని పార్టీ నేతలందరూ కూడా పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నడుచుకోవాల్సి ఉంటుందని పార్టీ కార్యకర్తకు నేతలకు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తేవాలని సూ చించారు. జిల్లావ్యాప్తంగా గ్రామ మండల పట్టణ బ్లాక్ కమిటీలను పూర్తి చేసి జిల్లా కమిటీని ప్రకటించడం జరుగుతుందని అం దులో తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు అందుతాయని తెలిపారు.

డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లౌకికపాటేని ఇది అందరికీ న్యాయం చేసే పార్టీని పార్టీలో ఓ సైకుడిగా తాను కష్టపడి పని చేస్తారని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి రామలింగం దుర్గాభవాని గండ్రదీశ్వర్ కృష్ణవేణి భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది అజార్ పత్తి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.