calender_icon.png 16 May, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు

16-05-2025 12:01:40 AM

-కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 15(విజయ క్రాంతి):విద్యార్థుల కొరకు నిర్వహించిన వేస వి శిక్షణ శిబిరాలలో నేర్పించిన అంశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం వాం కిడి మండల కేంద్రంలోని ప్రధానమంత్రి శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాశాఖ ఆ ధ్వర్యంలో 15 రోజులపాటు వేసవి శిక్షణ శిబిరా లను నిర్వహించిందని తెలిపారు. విద్యార్థు లు వేసవికాలంలో ఇంట్లో ఎక్కువ సమ యం గడపడంతో టీవీ, మొబైల్‌లతో సమ యం వృథా చేసుకుంటున్నారని ప్రభుత్వం వేసవి శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ శిబిరంలో ఉపాధ్యాయులు, వలంటీర్లు నేర్పించిన అం శాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, నృ త్యం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, ఆటలు, బొమ్మలు వేయడం, సంగీతం నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందన్నారు.ఆటలు ఆడడంతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని, విద్యార్థులు శిబిరంలో నేర్చుకున్న అంశాలను కొనసాగించాలని తెలిపారు.

శిబిరంలో నేర్పించిన అంశాలపై పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాలు సాధించే విద్యార్థులకు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు, వేసవి శిబిరం సమన్వయకర్త ఉప్పులేటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.