calender_icon.png 21 June, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డమ్మీ హెలికాప్టర్లో మంటలు

21-06-2025 01:29:39 AM

బడంగ్ పేట్,జూన్ 20: మహేశ్వరం నియోజకవర్గం లోని గుర్రం గూడా లో  పోచమ్మ గుడి సమీపంలో సినిమా షూటిం గ్ కోసం వినియోగించే  డమ్మీ  హెలికాప్టర్ లో మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గత కొంతకాలంగా డమ్మీ హెలికాప్టర్ ను నిర్వాకులు అక్కడే పార్క్ చేసి ఉంచారు. హెలికాప్టర్ లో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన స్థానికులు ఘటన స్థలా నికి చేరుకొని మంటలను ఆర్పి వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికులు ఇది గమనించకపోతే  ఘటన సమీపంలోనే బ స్సులు, కార్లు కు మంటలు అంటుకొనే పరిస్థితి ఉండేది. ఘటన స్థలానికి చేరుకున్న పో లీసులు  హెలికాప్టర్ లో మంటలు ఎలా చెలరేగాయని? ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా.... ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటించారు అనే కోణంలో పోలీ సులు దర్యాప్తుచేపట్టారు.