31 July, 2026 | 12:58 AM

తుంగతుర్తిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు.. ఎమ్మెల్యే కృషి పట్ల హర్షం

31-07-2026 12:02 AM

ఎమ్మెల్యే సామేలు కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ మండల అధ్యక్షు రేగటి రవి గౌడ్

తుంగతుర్తి, జులై 30: నియోజకవర్గ కేంద్రం తుంగతుర్తిలోనే మంజూరైన ఫైర్ స్టేషన్ ఎమ్మెల్యే సామేలు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు ఫైర్ స్టేషన్ తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం లేదంటూ అపోహాలు సృష్టించడం జరిగిందని, అవి ఎవ్వరు నమ్మవద్దని, ఎమ్మెల్యే ప్రత్యేకంగా తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, వారికి మండల కాంగ్రెస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలో మొత్తం 2000 కోట్ల ప్రత్యేక నిధులతో విద్యా, వైద్య, గ్రామపంచాయతీ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పని చేసే అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి శ్రీను, చింతకుంట్ల బాబు, రుద్ర రామచంద్రు, రాఘవులు, అబ్బగాని వేణు తదితరులు పాల్గొన్నారు.