31 July, 2026 | 12:45 AM

సంక్రాంతి నాటికి పతంజలి పామ్‌ఆయిల్ యూనిట్ పూర్తి చేయాలి

31-07-2026 12:00 AM

జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, జూలై 30 :పతంజలి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణ పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

గురువారం అనుముల మండలం, యాచారం గ్రామంలో 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న పతంజలి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణం పనులను పరిశీలించారు. యంత్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్షన్, ప్రాసెసింగ్ విభాగాలు, పార్కింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు, కంపెనీ ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, రైతులు పండించే పంటకు మార్కెట్ సమస్య లేకుండాయూనిట్కీలకంగాఉపయోగపడుతుందని అన్నారు. ప్రాసెసింగ్ సౌకర్యం ఉండటం వల్ల రవాణా వ్యయం, పంట నాణ్యత,ధర లభిస్తుందని తెలిపారు.

ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.పతంజలి యాజమా న్య ప్రతినిధులు మిల్లుకు అవసరమైన యంత్రాలలో 90 శాతం సైట్కు చేరుకున్నాయని,సివిల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ పనులు జరుగుతున్నాయని, మిగిలిన పనులు పూర్తి చేసి సంక్రాంతి నాటికి పరిశ్రమను ప్రారంభిస్తామని కలెక్టర్కు వివరించారు.ఈ పరిశీలనలో జిల్లా హార్టికల్చర్ అధికారి టి. శేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, శాస్త్రవేత్త రాములమ్మ, పతంజలి ప్రతినిధులు సంగని కుమార్, బి. యాదగిరి, బొబ్బిలి వినాయక తదితరులు పాల్గొన్నారు.