14 July, 2026 | 4:08 PM

Breaking News

ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •  

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు

14-07-2026 03:21 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన తొలిముద్ద కార్యక్రమం పసిపిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ నరసమ్మ సమక్షంలో కార్యక్రమాన్ని పెంచారు. ఈ కార్యక్రమాలలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణ మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరై పసిపిల్లలకు తొలిముద్దును తినిపించారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఉపకరిస్తుందన్నారు పథకాన్ని అర్హులైన వారందరూ ఉపయోగించుకోవాలని కోరారు. పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు తొలిముద్దు కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మౌనిక అంగన్వాడి కార్యకర్తలు లలిత భూలక్ష్మి శకుంతల బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్ వార్డు సభ్యులు గిరీష్ సన్నీ రెడ్డి అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.