లింగాపురంలో తొలి దశ జనగణన ప్రారంభం
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు రూపకల్పన
- దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ
చర్ల,(విజయక్రాంతి): గ్రామాల్లో జనగణన – 2027 తొలి దశ (సెన్సుస్ – 2027) కార్యక్రమాన్ని . “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” (హౌస్ లిస్టింగ్ & హోసింగ్ సెన్సుస్ ) కార్యక్రమం ఈనెల 11 నుండి ప్రారంభమై జూన్ 9 వరకు జరుగుతుందని. ఇందులో భాగంగా ఇండ్ల గుర్తింపు, గృహాలకు క్రమ సంఖ్యలు కేటాయింపు, డోర్ నంబరింగ్, ఎన్యూమరేషన్ కార్యక్రమాలు జరుగుతాయని ఎన్యూమరేటర్ శ్రీ లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడే జనగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే ఆధారంగానే భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతాయని తెలిపారు. అలాగే జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, ప్రతి కుటుంబం బాధ్యతగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ నాగరాజు పాల్గొన్నారు.






