10 April, 2026 | 11:28 AM

తొలి విడత ప్రశాంతం

12-12-2025 02:11 AM

కరీంనగర్, డిసెంబర్11(విజయక్రాంతి): కరింనగర్ ఉమ్మ డి జిల్లాలోని 369 గ్రామ పంచాయతీల్లో తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 81. 42% పోలింగ్ నమోదు..కరింనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని మొత్తం 81 గ్రా మా పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లాలో మొదటి విడత పోలింగ్ శాతం 77.68 గా నమోదయింది.

మొత్తం 2,18,194 ఓట్లలో పోలైన ఓట్లు 1,69,846 భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపెల్లి, మెట్ పెల్లి మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు.భీమారం మండలంలో మొత్తం ఓటర్లు 17,577మంది ఉండగా, 13,476 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.67 శాతం నమోదు అయింది. ఇబ్రహీంపట్నం* మండలంలో మొత్తం ఓటర్లు 30,465 మంది ఉండగా, 23,802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

78.13 శాతం నమోదు అయింది. కథలా పూర్ మండలంలో మొత్తం ఓటర్లు 37,516 మంది ఉండగా, 28,042 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.75 శాతం నమోదు అయింది. కోరుట్ల మండలంలో మొత్తం ఓటర్లు 31,243 మంది ఉండగా, 24,617 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.79 శాతం నమోదు అయింది. మల్లపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 41,103 మంది ఉండగా, 32,913 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

80.07 శాతం నమోదు అయింది.మేడిపెల్లి మండ లంలో మొత్తం ఓటర్లు 24,251 మంది ఉండగా, 18,777 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.43 శాతం నమోదు అయింది.మెట్ పెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 36,039 మంది ఉండగా, 27,859 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.3 శాతం నమోదు అయింది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ 79.57 శాతం నమోదు అ యింది.

చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో గురువారం పో లింగ్ నిర్వహించారు. ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,11,148 ఓట్లు ఉండగా, 88,442 పోల్ అయ్యాయి. మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు 79.57 శాతం పోలింగ్ నమోదు అయింది.వేములవాడ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 18,825 మంది ఉండగా, 15,525మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.47 శాతం నమోదు అయింది.

కోనరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 34,641 మంది ఉండగా, 28,420 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.04 శాతం నమోదు అయింది. చందుర్తి మండలంలో మొత్తం ఓటర్లు 28,094 మంది ఉండగా, 21,823 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.68శాతం నమోదు అయింది.వేములవాడ అర్బన్ మండలంలో మొత్తం ఓటర్లు 18,492మంది ఉండగా, 14,687 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.42 శాతం నమోదు అయింది.

రుద్రంగి మండలంలో మొత్తం ఓటర్లు 11,096 మంది ఉండగా, 7,987 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 71.98 శాతం నమోదు అయింది. పెద్దపల్లి జిల్లాలో 82.27 శాతం పోలింగ్ నమోదయింది.  పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత 5 మండలాల పరిధిలో లక్షా 18 వేల 346 మంది ఓటర్లు తమ ఓటు హక్కు పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకున్నారు.-----ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి -----వివిధ గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ పరిశీలనమొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కరింనగర్‌జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, కొత్తపల్లి మండలం బద్దిపల్లి మం డల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు.

పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ రిటర్నింగ్ అధికారినిఆదేశించారు.