20-08-2025 12:54:37 PM
హనుమకొండ (విజయక్రాంతి): కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది బండి కళాధర్(lawyer Bandi Kaladhar) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడితల ప్రణవ్ గూడూరు గ్రామానికి చేరుకొని బండి కళాధర్ నివాసంలో ఆయనను కలిసి పార్టీలో చేరాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రతిష్టంగా చేపడుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ప్రముఖ న్యాయవాది బండి కళాధర్ హుజురాబాద్ కోర్టులో గతంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ పదవీ బాధ్యతలు నిర్వహించారు.
ఆ సమయంలోనే కమలాపూర్ జడ్పిటిసి స్థానాన్ని తనకు కేటాయించాలని అప్పటి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ను కోరారు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఎసిపి పుల్ల శోభన్ కుమార్ ఆయన అనుచరులకు జడ్పిటిసి స్థానాన్ని కేటాయించారు. అప్పటి నుండి న్యాయవాది వృత్తిలో రాణిస్తున్న బండి కళాధర్ ఆయన 20 ఏళ్ల ప్రస్థానంలో రానున్న స్థానిక ఎన్నికల్లో జడ్పిటిసి టికెట్ను ఆశిస్తున్నట్లు సమాచారం. గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహరచనల్లో బండి కళాధర్ నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.