27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

కురవిలో చేపల చెరువు లూటీ

09-06-2026 01:33 AM

పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మత్స్యకారులు

ఆర్థికంగా నష్టపోయామని వెల్లడి

పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో లక్షల రూపాయల విలువైన చేపలను లూటీ చేశారని మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృగశిర కార్తె ప్రారంభం రోజున వందలాదిమంది ప్రజలు చెరువులో చేపలు పట్టేందుకు తరలివచ్చారు.

చెరువులో నీళ్లు అధికంగా ఉండడం వల్ల చేపలను పూర్తిస్థాయిలో పట్టలేదని, ప్రజలు ముకుమ్మడిగా తరలివచ్చి తమ చేపలను వలల ద్వారా పట్టుకోవడం వల్ల తమ జీవనోపాధికి గండి పడిందని, లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయినట్లు మత్స్య కారులు పోలీసులకు తెలిపారు.

ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు చెరువు కట్ట వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.మత్స్యకారులు పూర్తిగా చెరువులో చేపలను పట్టుకున్న తరువాతే ప్రజలు పట్టుకోవాలని, ఇలా ముందుగానే చేపలు పట్టుకోవడం సరైంది కాదని పోలీసులు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.