27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఉస్మానియా యూనివర్సిటీకి భారీ విరాళం

09-06-2026 01:32 AM

రూ.92 లక్షలకు పైగా పూర్వ విద్యార్థి సహాయం 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. మైనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల ఆధునికీకరణకు రూ.92 లక్షలకు పైగా సహాయం అందించారు. యూనివర్సిటీ విశిష్ట పూర్వ విద్యార్థి, అమెరికాలోని ’టెల్లా సకామోటో ఫౌండేషన్’ ప్రతినిధి టెల్లా గోపాల్ రావు 1,10,000 యూఎస్ డాలర్ల (సుమారు రూ.92 లక్షలకు పైగా) భారీ విరాళాన్ని అందజేశారు.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 1960 బ్యాచ్‌కు చెందిన టెల్లా గోపాల్‌రావు.. మైనిం గ్ విద్యారంగ పురోగతికి 1,00,000 డాలర్లను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 డాలర్లను కేటాయించారు. ఈ విరాళంపై ఉస్మానియా యూనివ ర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగురాం కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.