19-07-2024 11:13:17 AM
సూర్యాపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. మత్స్యశాఖకు చెందిన అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి దొరికిపోయాడు. రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రూపేందర్ సింగ్ శుక్రవారం పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సొసైటీ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.