calender_icon.png 20 July, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణ మాఫీ చరిత్రాత్మక నిర్ణయం

19-07-2024 11:21:26 AM

రైతు పక్షపాతి సీఎం,  మంత్రి శ్రీధర్ బాబు

మంథనిలో రుణ మాఫీ సంబురల్లో యవ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని, (విజయక్రాంతి): రుణ మాఫీ చరిత్రాత్మక  నిర్ణయమని కాంగ్రెస్ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. గురువారం మంథనిలో  రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు  చిత్రపటలాకు  పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.  శ్రీను బాబు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ...  భారతదేశంలోనే ఒకే సారి రుణమాఫీ చేయడం  ఒక చారిత్రాత్మక   నిర్ణయమని, ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆనాడు మేనిఫెస్టో చైర్మన్ గా శ్రీధర్ బాబు రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మేనిఫెస్టోలో రెండు లక్షల వరకు రుణమాఫీ అంశాన్ని చేర్చారని,  ఈ ప్రాంత రైతులందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్  రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.