మత్స్యకారులకు ఉపాధి, జీవిత భద్రత కల్పించాలి
తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం నేతల డిమాండ్
ముషీరాబాద్, మే 15 (విజయక్రాంతి): మత్స్యకార్మికులకు వృత్తి రక్షణ, ఉపాధి జీవిత భద్రత కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. దేశంలో మత్స్యవృత్తి జీవనాధారగా సుమారు 5 కోట్ల మంది మత్స్య కారులు, మత్స్యకార్మికులు ఉపాధి పొందుతున్నారని చేపలు, రొయ్యల ఉత్పత్తుల ఎగు మతుల ద్వారా దేశానికి కోట్లాది రూపాయ ల విదేశీ మారకద్రవ్యం ఆదాయంగా వస్తుందని వారు పేర్కొన్నారు.
గురువారం ఇంది రాపార్కు ధర్నా చౌక్లో తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు మత్స్యకార్మికులకు వృత్తి రక్షణ ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహా, ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ.
రాష్ట్ర నాయకులు పిట్టల రవీందర్లు మాట్లాడుతూ మత్స్య వృత్తిలో మైదాన ప్రాంత మత్స్యకారులు, సముద్ర తీర మత్స్యకారులు చేపల మార్కెట్లో హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసేవారిని చేపల ఎగుమతులు, దిగుమతులు డ్రెస్సింగ్ ప్రోసెసింగ్ చేసి మత్స్యకారులు ఇతర అనుబంధ వలలు, బోట్లు తయారీ, ఐస్ ప్యాకింగ్ అనుంబంధ వృత్తులపై ఆధారపడి జీవనోపాది పొందుతున్న కొట్లాది మంది మత్స్యకారులు, కార్మికులు సరైన అభివృద్ధిలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి యేటా కేటాయిస్తున లక్షల కోట్ల బడ్జెట్లలో బడా పెట్టుబడి దారులకు సంపన్న వర్గాలకు రాయితీ అందుతున్నాయే తప్ప మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. కేంద్రంలో గత పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల మత్స్య కారుల బతుకులపై అనేక భరాలతోపాటు సామాజిక అణిచివేత కూడా కొనసాగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేపల వేటకు వెళ్తు న్న మత్స్యకారుల జీవిత భద్రత కోసం ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా వంటి స్కీమ్ లు అమలు జరగడం లేదన్నారు. నాబార్డు వంటిబ్యాంకుల ద్వారా మత్స్యకారులకు ఇచ్చే రుణాలను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జల వనరులను, రిజర్వయర్లను, మత్స్యకారుల నుంచి దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుందని వారు విమర్శించారు.
దేశ వ్యాప్తంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించి మత్స్యకారుల అభివృద్ధి కోసం ఖర్చు చేసి రక్షణ చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మత్స్య సోసైటీలలోని సభ్యులందరికి 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలాంటి షరతులు లేకుండా అందించాలని అన్నారు. ఈ ధర్నాలో సంఘం నాయకులు కొప్పు పద్మ, బోడంకి చందు, శీలం శ్రీను, గొడుగు వెంకట్, కర్రెల్లి లలిత శంకర్, విజయకుమార్ తోపాటు మత్స్యకారులు, మత్స్యకా ర్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






