1 July, 2026 | 9:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలి

16-05-2025 12:00 AM

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్ 

చేర్యాల, మే 15  కొమరవెల్లి మండల కేంద్రంలో సంక్షేమ హాస్టల్లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొ మురవెల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొని మాట్లాడుతూ మండలం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ సంక్షేమ హాస్టల్లో ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.

హాస్టల్ వసతి లేక పేద మధ్యతరగతి వి ద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. మండలంలో ఎప్పటి వరకు జూనియర్ కళాశాల కూడా చేయకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైతున్నారన్నారు. స్థానిక ప్ర జాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే విద్యలో మండలం వెనుకబాటు కు గురవుతుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, హాస్టల్లను, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులను కూడగట్టుకుని సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అందాల రంజిత్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్, మాజీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ పాల్గొన్నారు.